తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.

సెక్స్ కామెడీ చిత్రాలు చూశా.. జీవితంలో ఆ పని చేయను.. తాప్సి!

హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి సాయి పల్లవి, వరుణ్ తేజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలు మొక్కలు నాటారు.

తాజాగా ప్రముఖ చలనచిత్ర దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్.. 'గ్రీన్ ఛాలెంజ్' స్వీకరించి  ఫిలింనగర్ లోని  తన నివాసంలో కదంబ మొక్కను నాటారు. అనంతరం ఈ ఛాలెంజ్  గురించి గొప్పగా మాట్లాడారు. హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని.. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ,ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

పర్యావరణం రాను రాను క్షిణిస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. ఎంపీ సంతోష్ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నంలా  కొనసాగిస్తున్నారని కొనియాడారు. 

"