ఝుమ్మందినాదం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి గ్లామర్, నటన పరంగా ఆకట్టుకుంది. మిస్టర్ పర్ఫెక్ట్, మొగుడు, దరువు, సాహసం లాంటి చిత్రాల్లో తాస్పి నటించింది. సరైన సక్సెస్ లేకపోవడంతో తాప్సి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో తాప్సి తన పంథా మార్చింది. అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ చేస్తూనే విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది. 

బాలీవుడ్ లో తాప్సి నటించిన పింక్, బద్లా చిత్రాలలో తాప్సి నటనకు ప్రశంసలు దక్కాయి. దీనితో ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులంతా ప్రయోగాత్మక చిత్రాలకు తాప్సిని హీరోయిన్ గా ఎంచుకుంటున్నారు. తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ సెక్స్ కామెడీ చిత్రాలని మాత్రం జీవితంలో చేయనని తేల్చి చెప్పేసింది. 

అందుకు గల కారణాన్ని కూడా తాప్సి వివరించింది. ఇప్పటి వరకు నేను చూసిన సెక్స్ కామెడీ చిత్రాల ద్వారా నాకు ఓ విషయం అర్థం అయింది. అందులో అమ్మాయిలపై అసభ్యకరమైన జోకులు వేస్తూ కామెడీ పండించడానికి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఆ క్షణంలో ఆడియన్స్ ని ఎలాగైనా నవ్వించాలనే ఉద్దేశం తప్ప సెక్స్ కామెడీ చిత్రాల్లో ఎలాంటి వినోదం ఉండడం లేదు. 

వాస్తవానికి ప్రేక్షకులు కోరుకునే వినోదం అంది కాదు. సెక్స్ కామెడీ చిత్రాల్లో ఉండే డబుల్ మీనింగ్ డైలాగులు, కొన్ని సన్నివేశాలు ఎక్కువగా మహిళలపై తప్పుడు ఉద్దేశం కలిగించేలా ఉన్నాయని తాప్సి పేర్కొంది. అందుకు అలాంటి చిత్రాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సి పేర్కొంది. 

అదేవిధంగా ఐటెం సాంగ్స్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తాప్సి తెలిపింది. నేను నేను హీరోయిన్ గా నటించే చిత్రాల్లో ఎంత గ్లామర్ గా కనిపించడానికైనా, ఎలాంటి సాంగ్స్ చేయడానికైనా సిద్ధం. కానీ కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే నన్ను పిలిస్తే చేయనని చెబుతా. నేను స్పెషల్ సాంగ్స్ లో కనిపించాలంటే బలమైన కారణం ఉండాలి అని తాప్సి అంటోంది.