టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ శుక్రవారం నాడు మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 7.22 గంటలకు మరణించారు.

'అల.. వైకుంఠపురములో' విజయోత్సవ వేడుక రేపే, వివరాలు!

బోయపాటి సీతారావమ్మ వయస్సు 80 సంవత్సరాలు.  గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామంలో మరణించారు. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియలు శనివారం నాడు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

గతేడాది 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.