స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కొట్టేసారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు రాగా.. మరోసారి ప్రేక్షకులకు ఆ మ్యాజిక్‌ చూపిస్తున్నారు. 'అల వైకుంఠపురములో' అంటూ విడుదలైన చేసిన ఈ సంక్రాంతి సినిమా కలెక్షన్స్ సునామీతో దూసుకుపోతోంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్  చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. జనవరి 19న అంటే రేపు వైజాగ్ లో ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరగనున్నాయి.

అల్లు అర్జున్, మహేష్ బాబుకి ఆ రికార్డ్ సాధ్యమేనా ?
 
జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబడుతోంది. పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ అతి త్వరలోనే లాభాల బాట పట్టనున్నారు.

ఈ దక్షిణాది సినిమాలు కలిపి అమెరికా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయని ప్రముఖ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. ఇక అమెరికా వీకెండ్‌ బాక్సాఫీస్‌ చార్ట్‌లో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు చోటు దక్కించుకోగా, ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా టాప్‌లో నిలవడం విశేషం.