నందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. 'లారీ డ్రైవర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి.

అయితే వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఘోర పరాజయంపాలైంది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. సినిమాలో కొన్ని సీన్లు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ తొడ కొడితే కుర్చీ ముందుకు రావడం, ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం వంటి విషయాలను బాగా ట్రోల్ చేశారు.

దేవదారు శిల్పంలా కియారా.. ఇంత హాట్ నెస్ తట్టుకోగలరా..?

ఇప్పటికీ ఆ సీన్లను సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తుంటారు. అంతగా నవ్వులపాలయ్యాయి. ఆ సన్నివేశాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడారు. 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని.. ఆ సినిమాలో కొన్ని సీన్లు విమర్శలపాలయ్యాయని అన్నారు.

ఆ సినిమాలో బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ పెట్టకుండా ఉండాల్సిందని అన్నారు. ఆ సీన్ గురించి ఇప్పటికీ బాధ పడుతుంటానని.. ఆ సీన్ పెట్టి తప్పు చేశాననే బాధ ఇప్పటికీ తనలో ఉందని గోపాల్ చెప్పారు.