80వ దశకంలో దూరదర్శన్ లో ప్రసారమైన రామాయణం టీవీ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు రామానంద్ సాగర్ రామాయణాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఆ టీవీ సిరీస్ ద్వారా చూపించారు. ఆ అద్భుత దృశ్య కావ్యంలో నటి దీపికా చిక్లియా సీత పాత్రలో నటించారు. 

సీత పాత్ర ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె పాత్రకు ప్రేక్షకుల ఆదరణ గుర్తింపు లభించాయి. సీత పాత్ర దీపికకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. ఎవరైనా సెలెబ్రిటీ కనిపిస్తే హాయ్ చెబుతారు. కానీ నేను కనిపిస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారని దీపికా పేర్కొన్నారు. 

హరీష్ శంకర్ తో జీవితంలో సినిమా చేయను.. లైవ్ లోకి కొడుకులని తీసుకొచ్చి బండ్ల గణేష్ కామెంట్స్

లాక్ డౌన్ కారణంగా రామాయణం టివి సిరీస్ ని తిరిగి ప్రసారం చేయగా.. 7.7 కోట్ల వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా దీపికా సోషల్ మీడియాలో సీత పాత్రలో ఉన్న తన ఫోటోని షేర్ చేసింది. సీతా దేవిగా తాను వేసిన తొలి అడుగులు అవేనని దీపికా పేర్కొంది. 

ఆ అడుగులే తనకు ఓ పునర్జన్మ అని పేర్కొంది. అప్పటిదాకా దీపికా అయిన నేను ఆ అడుగుతో సీతా దేవిగా మారిపోయానని అందమైన ఫోటోని షేర్ చేశారు.