స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 6న చిత్రయూనిట్ భారీగా మ్యూజిక్ కన్సర్ట్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.

సాంగ్ లో కూడా ఫైట్.. చిందేసిన త్రివిక్రమ్!

ఈ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొని చిత్రబృందాన్ని విష్ చేశారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తున్నారని దిల్ రాజు అన్నారు. తమన్ పాటలతో, బన్నీ డాన్స్ లతో, త్రివిక్రమ్ డైలాగ్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు.  

ఈ మధ్యకాలంలో ఇలాంటి మ్యూజికల్ హిట్స్ చూడలేదని.. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయని.. తమన్ రాక్ చేస్తున్నాడని అన్నారు.