Asianet News TeluguAsianet News Telugu

సాంగ్ లో కూడా ఫైట్.. చిందేసిన త్రివిక్రమ్!

స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Ram lakshman speech at Ala Vaikunthapurramuloo Musical Concert
Author
Hyderabad, First Published Jan 6, 2020, 8:34 PM IST

అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ప్రసంగించారు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఓ సాంగ్ లో కూడా త్రివిక్రమ్ గారు తమ చేత ఓ ఫైట్ కంపోజ్ చేయించారని అన్నారు. 

రామ్ లక్ష్మణ్ ప్రసంగిస్తుండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చారు. దీనితో రామ్ లక్ష్మణ్.. త్రివిక్రమ్ ని వేదికపైకి ఆహ్వానించారు. ఈ త్రివిక్రమ్ వచ్చిన వెంటనే రామ్ లక్ష్మణ్ డాన్స్ చేశారు. త్రివిక్రమ్ చేత కూడా డాన్స్ చేయించడానికి ప్రయత్నించారు. 

అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సాంగ్ లో కూడా మాస్టర్స్ అద్భుతంగా ఫైట్ ని కంపోజ్ చేశారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరికీ డాన్స్ మాస్టర్స్ గా కూడా అవకాశాలు వస్తాయి అని త్రివిక్రమ్సరదాగా వ్యాఖ్యానించారు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోకి అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. 

శ్రీకాకుళం సర్ ప్రైజ్ సినిమాలోనే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

Follow Us:
Download App:
  • android
  • ios