ఈ మధ్యకాలంలో సినిమాని ప్రమోట్ చేసే విధానాలు మారాయి. ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ స్దానే సోషల్ మీడియా, వెబ్ సైట్స్ వచ్చే చేరాయి. ముఖ్యంగా చిన్న సినిమాని ప్రమోట్ చేసేందుకు వీటిని ఎంత సమర్దవంతంగా ఉపయోగించుకున్నారనే దాన్ని బట్టి ఓపినింగ్స్ ఉంటున్నారు. పెళ్లి చూపులు చిత్రంతో సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ తరహా ప్రమోషన్స్ మొదలెట్టి..రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పని దిల్ రాజు తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాకు చేస్తున్నారు.

 ఫేస్ బుక్ లో ఈ సినిమాకు రివ్యూలు రెండు రోజుల ముందు నుంచే కనపడుతున్నాయి. కాలేజీ స్టూడెంట్స్ కు ఈ సినిమా ప్రివ్యూ వేయటం జరిగింది. అలాగే కొందరు సినిమా లవర్స్ కు ఈ సినిమా షో లు వేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెప్తున్నారు.  ఆ రివ్యూలు పాజిటివ్ గా ఉండటంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మెల్లిగా ఏర్పడుతున్నాయి. భాక్సాఫీస్ వద్ద ఓపినింగ్స్ కు ఈ బజ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

ఇక ఈ రివ్యూల్లో అందరూ రాస్తున్నది ఒకటే అంశం. మంచి ఫీల్ గుడ్ మూవి అని మెచ్చుకుంటున్నారు. అలాగే సమీర్ రెడ్డి  కెమెరా వర్క్ అద్బుతంగా ఉందని, ఓ పెయింటింగ్ లా సినిమా సాగిందని, ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా, కామెడీ కోసం, వేరే అవసాల కోసం సినిమాని ప్రక్కదారి పట్టించకుండా డైరక్టర్ ఓ నిబద్దతో తెరకెక్కించారని అంటున్నారు.హీరోయిన్ షాలినీ పాండే అయితే దుమ్ను రేపిందని, అర్జున్ రెడ్డి సినిమా కన్నా మంచి పేరు తెచ్చుకుంటుందని అంటున్నారు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు. రేపు థియోటర్ లో కూడా అదే స్దాయి రెస్పాన్స్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. అదే కనుక జరిగిదే సినిమా మంచి హిట్టే అవుతుందని ట్రేడ్ లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో షాలినీపాండే అదరకొట్టిందని, నటన అద్బుతంగా ఉందని టాక్. రాజ్ తరణ్ కు అయితే రీలాంచ్ సినిమా లాంటిదిట. అందుకే దిల్ రాజు అడగగానే వేరే ఆలోచన లేకుండా ఓకే చేసారట.

యంగ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది. ఎల్లుండి అంటే డిసెంబర్ 25న రిలీజ్.  తన బ్యానర్ లో ఓ హిట్ సినిమా రాబోతోందని దిల్ రాజు ఆనందంగా ఉన్నారట.
 
 ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్‌. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు.’’ అన్నారు.