డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత నిర్మాతగా మారారు దిల్ రాజు. కథను విని జడ్జి చేయడం, సినిమా చూసి మార్పులు చేర్పులు చెప్పడం వంటివి చెబుతుంటారు దిల్ రాజు. ఆయన జడ్జిమెంట్ ని ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతారు. తనతో పని చేసే దర్శకులంతా కూడా దిల్ రాజు మాట కాదనరు.

కానీ ఓ దర్శకుడు మాత్రం దిల్ రాజు మాట లెక్కచేయలేదని తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే.. ప్రేమ్ కుమార్. రీసెంట్ గా విడుదలైన 'జాను' సినిమాను డైరెక్ట్ చేశారు ప్రేమ్. తమిళంలో విడుదలైన '96' సినిమా చూసిన దిల్ రాజు ఫిదా అయిపోయి ఆ సినిమా రైట్స్ ని తీసుకున్నారు.

ద్వితీయ వివాహానికి సిద్దపడుతున్న దిల్ రాజు

ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ నే తెలుగు వెర్షన్ కోసం తీసుకున్నారు. సినిమాకి సంబంధించిన బాధ్యతలన్నీ అతడికే అప్పగించారు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ అంతా మరీ హీరోయిన్ మాత్రమే ఉంటారని.. అందువల్ల కొన్ని సీన్లు యాడ్ చేద్దామని సూచించారని తెలుస్తోంది.

హోటల్ లో శర్వానంద్ కూర్చొని సమంతతో మాట్లాడే సన్నివేశాలను కాస్త విజువలైజ్ చేసి చూపిద్దామని దిల్ రాజు చెప్పారట. స్లో టేకింగ్ ని కొద్దిగా మార్చాలని కూడా చెప్పారట. కానీ దర్శకుడు ఇవేవీ పట్టించుకోకుండా తన స్టైల్ లోనే సినిమా తీశారట. కనీసం సినిమా ప్రచారానికి కావాల్సిన స్టిల్స్ ని కూడా లాస్ట్ మినిట్ వరకు దర్శకుడు ఇవ్వలేదని తెలుస్తోంది.

దాంతో ఇక దిల్ రాజు విసుగెత్తి ఊరుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తరువాత మంచి టాక్ వచ్చింది. కానీ బీ, సీ ఆడియన్స్ కి స్లో టేకింగ్ పెద్దగా ఎక్కలేదు. దిల్ రాజు ఎంతో ఇష్టపడి తెలుగులో తీసుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు అన్ని వర్గాల వారిని మెప్పించలేకపోయింది. యూత్ కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.