బిగ్ బాస్ షో మాజీ కంటెస్టంట్ పాయల్ రోహ్తగీ కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్స్ తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా పాయల్ కూడా తాను ఎదుర్కొన్ని ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ దివాకర్ బెనర్జీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఒక సినిమా ఆఫర్ ఇప్పిస్తానంటూ దివాకర్ వేధించాడని ఆమె చెప్పుకొచ్చింది. 2011లో ఆ డైరెక్టర్ తనను ఇండస్ట్రీ పరిచయం చేస్తానని మెసేజ్ పంపించాడని చెప్పారు.

వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు

ఆ తరువాత తనతో పరిచయం పెంచుకొని స్నేహం చేశాడని.. ఆ సమయం తనకు మెంటర్ దొరికాడని సంతోషించానని చెప్పారు. అతడి సినిమా 'షాంగై'లో పాత్ర ఇస్తానని చెప్పినప్పటి నుండి సమస్య మొదలైందని గుర్తు చ్సుకున్నారు.

తన ఇంటికి వచ్చి బరువు పెరిగిపోతున్నానని చెప్పి, షర్టు ఎత్తి పొట్ట చూపించాలని కోరినట్లు చెప్పారు. అయితే దానికి తను అంగీకరించలేదని, వెంటనే అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పానని తెలిపారు. అప్పటినుండి దివాకర్ తనకు దూరంగా ఉంటున్నాడని పాయల్ తెలిపారు.