'డిగ్రీ కాలేజ్' సినిమాను ప్రదర్శించడానికి వీళ్లేదని నగరంలోని బాలీవుడ్, హాలీవుడ్ సినిమా థియేటర్ల వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులూ శుక్రవారం నాడు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

'డిగ్రీ కాలేజ్'ని ఒక విద్యాలయంగా కాకుండా అశ్లీలతకు నిలయంగా ట్రైలర్ లో దర్శకుడు సన్నివేశాలను చూపించారని అన్నారు. డబ్బులు సంపాదించడం కోసం దర్శకనిర్మాతలు క్లాస్ రూమ్ లో అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి ఏపీ, తెలంగాణాలో విడుదల చేయడం, సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడం దారుణమని అన్నారు.

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఇదే!

ఈ సినిమా ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని చిత్రీకరించారని ప్రశ్నించారు. దిశ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సినిమాలను ఎలా ప్రోత్సహిస్తుందని నిలదీశారు.

వెంటనే ఈ సినిమాని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అరండల్ పేట సీఐకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సందీప్, కిరణ్, కబీర్, హసీనా, వైష్ణవి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.