ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నర్సింహ నందికి చిక్కులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లో నర్సింహ నందిపై కేసు నమోదైంది. టాలీవుడ్ లో నర్సింహ నంది 1940లో ఒక గ్రామం, హై స్కూల్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

1940 లో ఒక గ్రామం చిత్రానికి జాతీయ అవార్డు, నంది అవార్డు వచ్చాయి. ఇటీవల నర్సింహ నంది తెరకెక్కించిన డిగ్రీ కాలేజ్ చిత్రం పెద్ద వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. మితిమీరిన శృంగార భరిత సన్నివేశాలతో ఈ చిత్ర ట్రైలర్ వివాదం సృష్టించింది. 

హాట్ నెస్ కు మరో అర్థం..మైండ్ బ్లాక్ చేస్తున్న మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో!

నటి జీవిత కూడా ఈ చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ చిత్రానికి సంబంధించిన అశ్లీల పోస్టర్స్ ని హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేశారు. 

దీనితో బుధవారం రోజు పోలీసులు నర్సింహ నంది, చిత్ర నిర్మాత శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. డిగ్రీ కాలేజ్ చిత్రం గురించి మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి చిత్రాల పుణ్యమా అని ఇలాంటి అడల్ట్ చిత్రాలు ఎక్కువవుతూ టాలీవుడ్ పరువు తీస్తున్నాయని గతంలో జీవిత విమర్శించారు. నర్సింహ నంది అరెస్ట్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.