ఈసారి సంక్రాంతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. రజినీకాంత్ 'దర్బార్' జనవరి 9న ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మహేష్ బాబు తన సత్తా చాటడానికి రానున్నాడు. ఇక 12న అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', 15న 'ఎంత మంచివాడవురా' సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రానున్నాయి.

నాలుగు సినిమాలు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. బన్నీ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాఫై ఇప్పటికే పాజిటివ్ బజ్ మొదలైంది. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. పాటల విషయంలో సంక్రాంతికి వస్తోన్న అన్ని చిత్రాల్లో 'అల.. వైకుంఠపురములో' టాప్ ప్లేస్ లో ఉంది.

హాట్ గురూ : అందాలతో పిచ్చెక్కిస్తున్న మాజీ హీరోయిన్

'సామజవరగమనా', 'రాములో.. రాములా' పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకి ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా చూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా టైటిల్ ని బాగానే రాస్తున్నారు. కానీ అదే టైటిల్ ని ఇంగ్లీష్ లో రాయాలంటే మాత్రం చాలా స్పెల్లింగ్స్ గూగుల్ లో సెర్చ్ అవుతున్నాయి. 'Ala Vaikunthapurramuloo' అనేది చిత్రయూనిట్ అనుకున్న టైటిల్ కాగా.. 'Ala Vaikuntapuramlo, Ala Vaikuntapuramulo, Ala Vaikuntapuramuloo' ఇలా చాలా స్పెల్లింగ్స్ గూగుల్ లో ట్రెండ్ అవుతున్నాయి.  

చిత్ర యూనిట్ మాత్రం ‘Ala VaikunthapuRRamuloo’ అనే స్పెల్లింగ్‌ కి ఫిక్స్ అయింది. ఇందులో రెండు Rలు పక్కనే ఉండడం వెనుక ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ నటించిన SaRRainodu(సరైనోడు), Race GuRRam(రేసుగుర్రం) చిత్రాలను గమనిస్తే రెండు 'R'లు పక్కనే ఉంటాయి.

ఇలా రెండు 'R'లు పక్కపక్కనే ఉన్న అల్లు అర్జున్ రెండు చిత్రాలు 'సరైనోడు', 'రేసుగుర్రం' చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇదే సెంటిమెంట్ ని 'అల వైకుంఠపురములో' చిత్రానికి సైతం రిపీట్ చేస్తూ ఇంగ్లీష్ టైటిల్ లో రెండు 'R'లను యాడ్ చేశారు. మరి ఈ 'RR' సెంటిమెంట్ 'అల.. వైకుంఠపురములో' సినిమా విషయంలో వర్కవుట్ అవుతుందేమో చూడాలి!