కరోనా వైరస్ ప్రభావంతో ఇండియా మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనితో సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమై తమ క్వారంటైన్ విశేషాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా సెలెబ్రిటీ కపుల్ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ తమ రొమాంటిక్ క్వారంటైన్ విశేషాల్ని ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. 

దీపికా పదుకొనె రణవీర్ కోసం పిజ్జాలు తయారు చేస్తున్న దృశ్యాలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ రోజు దీపికా తయారు చేసిన పిజ్జాలు తినబోతున్నా అంటూ రణవీర్ కామెంట్స్ చేశాడు. మరో పిక్ లో దీపికా పిజ్జాలని మరింత రుచికరంగా మారుస్తోంది. దీనిపై రణవీర్ దీపికాని ఉద్దేశిస్తూ ' చీజీ లవర్' కామెంట్ చేశాడు. 

'చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు'.. వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్

ఇటీవల దీపికా థాయ్ వంటకాలు చేస్తున్న దృశ్యాలని కూడా రణవీర్ అభిమానులతో పంచుకున్నాడు. దీపికా వంటకాల్లో బాగా ట్రైన్ అయిన చెఫ్ అని తెలిపాడు. ఇలా ఈ సెలెబ్రిటీ జంట రొమాంటిక్ గా వంటకాలతో తమ క్వారంటైన్ ని గడుపుతున్నారు. 


సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా, రణవీర్ కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83 లో నటిస్తున్న సంగతి తెలిసిందే.