టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ మొత్తం రౌడీ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. 'అర్జున్ రెడ్డి'లో అగ్రెసివ్ క్యారెక్టర్ తో రెచ్చిపోయిన విజయ్, 'గీత గోవిందం'లో సైలెంట్ గా ఉండే అబ్బాయిలా కనిపించాడు.

పాత్రకు తగ్గట్లు మారిపోయే ఈ హీరోకి టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. గతేడాది విజయ్ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ హిందీలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

రొమాన్స్ లో రెచ్చిపోయారు.. వినసొంపుగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సాంగ్!

తెలుగులో డిజాస్టర్ అయిన ఈ సినిమాని బాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా సినిమాలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాని కూడా యూట్యూబ్ లో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాకి ఒక్క రోజులోనే 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా అధ్బుతంగా ఉందని.. విజయ్ నటనని కొనియాడుతున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించారు.