రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాలుగు హీరోయిన్లు విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తున్నారు. 

ఐశ్వర్య రాజేష్, రాశి ఖన్నా, ఇజా బెల్లె, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ హాట్ టాపిక్ గా మారింది. మరోసారి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తరహాలో రొమాన్స్ లో రెచ్చిపోయినట్లు కనిపిస్తున్నాడు. 

లుక్ టెస్ట్ కంప్లీట్.. మొఘల్ సామ్రాజ్యంలో పవన్.. ఉత్కంఠ రేపేలా క్రిష్ చిత్రం!

తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు. 'మై లవ్' అంటూ సాగే ఈ పాటలో కూడా విజయ్ దేవరకొండ, హీరోయిన్ల మధ్య రొమాన్సే హైలైట్ గా కనిపిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ పాట వినసొంపుగా ఉంది. శ్రీ కృష్ణ, రమ్య బెహ్రా ఈ పాటని పాడగా..రెహ్మన్ సాహిత్యం అందించారు. 

లిరికల్ వీడియోలో చూపిన విజువల్స్ లో విజయ్ దేవరకొండ.. రాశి ఖన్నా, కేథరిన్, ఇజా బెల్లె, ఐశ్వర్య రాజేష్ మధ్య రొమాన్స్ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చివరగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో ఈ రౌడీ హీరో ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.