వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ నెక్స్ట్ దర్బార్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తెలుగులో రజిని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అనేది సందేహంగా మారింది. ఎందుకంటె గత తలైవా గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం వసూళ్లు అందుకోలేకపోయాయి.

కబాలి నుంచి రజిని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ బాగా తగ్గిపోయింది. 2.0 కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న దర్బార్ సినిమాపై కూడా పడింది. ఎందుకంటె ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 14కోట్లు మాత్రమే. ఇది మినిమమ్ రేట్ అయినప్పట్టికీ ఓ వైపు మురగదాస్ లాంటి డైరెక్టర్ సినిమాని తెరకెక్కించినప్పటికీ అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.

ప్రస్తుతం సినిమా బజ్ తమిళనాడులో బాగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో అసలు చప్పుడే లేదు. గతంలో రజిని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే.. తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణమే కనిపించడం లేదు. అనిరుద్ ఇచ్చిన సంగీతం కూడా సినిమాకు తెలుగులో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో కలెక్షన్స్ ఎంతవరకు అందుతాయి అనేది క్లిష్టంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ - మహేష్ సినిమాల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదు. మరీ ఇలాంటి పరిస్థితుల్లో దర్బార్ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

'సరిలేరు నీకెవ్వరు'.. సింగిల్ స్క్రీన్స్ కోసం భారీ డిమాండ్!