సంక్రాంతి నాడు మాస్ సినిమాలు క్లిక్ అయితే ఎలా ఉంటుందో గతంలో చాలా సార్లు చూశాం. 'ఖైదీ నెం 150' ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మల్టీప్లెక్స్ లో కాకుండా సింగిల్ స్క్రీన్స్ లో మాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. ఇటీవల ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదలయ్యాయి. వీటిని బట్టి ఏ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో ఎగ్జిబిటర్లు ఓ క్లారిటీకి వచ్చాయి.

కుర్ర హీరో 'అతి..' ప్రాజెక్ట్ వదిలేసిన డైరెక్టర్..?

'సరిలేరు నీకెవ్వరు' సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీశారనే విషయం స్పష్టమైంది. ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో బి,సి సెంటర్లలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ ల ఊసు కూడా తెలియని కొన్ని ప్రాంతాల్లో రెండేసి థియేటర్లే ఉంటే రెండిట్లో కూడా 'సరిలేరు' వేయాలనే డిమాండ్లు వస్తున్నాయట.

దాని కోసం భారీగా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తుంటే 'సరిలేరు నీకెవ్వరు'కి హిట్ టాక్ వస్తే పల్లటూర్లలో, చిన్న పట్టణాల్లో 'అల.. వైకుంఠపురములో' సినిమాకి థియేటర్లు సరిపడా దొరకడం కష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. మొదటి నుండి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని మాస్ సినిమాగానే పోట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రమోషన్ సింగిల్ స్క్రీన్స్ లో సినిమాకి డిమాండ్ పెరిగేలా చేస్తుంది!