Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

Darbar slows down Collections in telugu
Author
Hyderabad, First Published Jan 13, 2020, 10:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌ చిత్రంతో సంక్రాంతికు ముందే వచ్చేసాడు. తెలుగులోనూ చాలా కాలం తర్వాత మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న రజనీ సినిమా ఇది. గతంలో వచ్చిన ‘కాలా’ ‘పేట’ సినిమాల సక్సెస్ కేవలం ట్రైలర్లు కే పరిమితం అయ్యింది. అయితే ఈ సారి డైరెక్టర్ మురగదాస్ దర్బార్  రజనీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడు. వింటేజ్ లుక్‌లో రజనీ లుక్స్, మేనరిజమ్స్ సాధారణ ఆడియెన్స్‌ను సైతం సర్‌ప్రైజ్ చేశాయి.

తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సింహనాదం చేసాడు తలైవా. పోటీగా సినిమాలేవీ లేకపోవడంతో సౌత్ అంతా సాలిడ్ ప్రదర్శన ఇచ్చాడు. అయితే ఆ కలెక్షన్స్ ఎంతవరకూ కంటిన్యూ అవుతాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. ఆ ఇంపాక్ట్ దర్బార్ కలెక్షన్స్ పై పడటం మొదలైంది.  ఓవర్సీస్‌లో కూడా మ్యాజిక్ చేస్తోన్న సూపర్‌స్టార్..తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 4.40 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్  లో చెప్పారు. అయితే రెండో రోజుకు వచ్చేసరికి 1.2 కు పడిపోయింది.

మరోసారి బికినీలో రెచ్చిపోయిన రకుల్!

మూడో,నాలుగో రోజుకు మరీ తగ్గిపోయాయి. తెలుగు జనం దృష్టి స్ట్రెయిట్ సినిమాలపై ఉండటంతో ఈ పరిస్దితి ఏర్పడింది. అయితే తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువ రేటుకే జరగటంతో పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. లాభాలు రాకపోవచ్చు అంతే అంటున్నారు. మరో ప్రక్క తెలుగులో పూర్తిగా ప్రమోషన్ ఆపేయటం మరో మైనస్.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 140 కోట్లు బిజినెస్ జరిగింది. తమిళ సిని చరిత్రంలో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూడో చిత్రం ఇది కావటం విశేషం. తెలుగులోనూ 14 కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే ఇక్కడ రజనీకి, మురగదాస్ కీ మార్కెట్ పడిపోవటంతో ఆ స్దాయిలో బిజినెస్ జరగలేదు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన  రెండు పెద్ద సినిమాలను తట్టుకుని ఏ మేరకు తెలుగులో నిలబడుతుందనేది ఇప్పుడు ఈ సినిమా ముందున్న పెద్ద ఛాలెంజ్.

ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios