ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అగ్ర నిర్మాతలు డివివి దానయ్య, బెల్లంకొండ సురేష్ ల మధ్య వివాదం నెలకొందని సమాచారం. దీనిపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. గతంలో ఓసారి బెల్లంకొండ సురేష్ కొంత మొత్తాన్ని దానయ్య వద్ద నుండి అప్పుగా తీసుకున్నారు. కానీ ఆ డబ్బు తిరిగివ్వకపోవడంతో సెటిల్మెంట్ వరకు వెళ్లిందట. దాదాపు రూ.80 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ పేమెంట్ కాలేదని తెలుస్తోంది.

ఆ ఇద్దరు దర్శకులలో.. శంకర్ డైరెక్షన్ లోనే నటిస్తా.. కేజిఎఫ్ హీరో కామెంట్స్!

ఇలాంటి నేపధ్యంలో ఏమైందో కానీ విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలుస్తోంది. నిర్మాత దానయ్య.. బెల్లంకొండపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజానికి దానయ్య కంప్లైంట్ చేసింది బాకీ డబ్బు వసూళ్ల కోసం కాదట.. బాకీ వసూళ్ల కోసం కోర్టులు ఉన్నాయి.

ఫోన్ లో బెల్లంకొండకి, దానయ్యకి మధ్య మాటా మాటా రావడంతో దానయ్య పోలీస్ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండకి రూ.80 లక్షలు పెద్ద విషయం కాదు.. కానీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూలు రావడంతో పోలీసుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

మరి ఈ సమస్యను వీరిద్దరూ ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. ప్రస్తుతం దానయ్య.. రాజమౌళితో 'RRR' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుండగా.. బెల్లంకొండ తన చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.