సోషల్ మీడియా కారణంగా రోజురోజుకి మోసాలు, దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అమాయకులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇలాంటి ఉదంతాలు చాలానే చూశాం. తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తిపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ పేరుతో కొన్ని రోజుల క్రితం నకిలీ అకౌంట్ తెరిచాడు ఓ వ్యక్తి,. అది చూసిన చాలా మంది ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తున్నారు. అందులో కొందరితో నేరుగా చాటింగ్ చేస్తున్నాడు మోసగాడు.

ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్.. అక్కడ వందల మందికి కరోనా!

కొద్దిరోజుల తరువాత తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తో చాటింగ్ చేయాలని.. అన్ని వివరాలు పరిశీలించిన తరువాత తాను నేరుగా చాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండలా చెబుతున్నాడు. ఆ తరువాత తన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ వేధిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయన తన అసిస్టెంట్ గోవింద్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి హేమ అనే పేరుతో చాటింగ్ చేయించారు. అందరికీ చెప్పే మాయమాటలే గోవింద్ కి కూడా చెప్పాడు. దీంతో విజయ్ తన మేనేజర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సుమారు పది మంది యువతులను ఇలానే మోసం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.