టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

అయితే గత నెల 19వ తేదీన క్రేన్ కిందపడి ఈ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం ఘటికలు మిగిలిన చిత్రయూనిట్ సభ్యులను వెంటాడుతూనే ఉన్నాయి.

నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది : కమల్ హాసన్

ప్రమాద సంఘటన కేసుని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న వారిని విచారించారు. అంతేకాకుండా చిత్రదర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ లకు సమన్లు జారీ చేశారు.

దర్శకుడు శంకర్, ఆ తరువాత నటుడు కమల్ హాసన్ చెన్నైలోని క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తదుపరి ఆ ఘటన ప్రాంతంలో ఉన్న ఇండియన్ 2 చిత్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు సమన్లను జారీ చేయనున్నట్లు తాజా సమాచారం.