కోవిడ్-19 (కరోనా వైరస్) దీని పేరు చెబితేనే ప్రస్తుతం ప్రపంచం వణికిపోతోంది. చైనాలో బయటపడిన ఈ మహమ్మారి ప్రస్తుతం 54 దేశాలకు విస్తరించి వేల మందిని బలి తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అటు భారత ప్రభుత్వం కూడా అన్ని ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది.

విదేశాల నుంచి వచ్చిన వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే బయటకు వదులుతోంది. తాజాగా దుబాయ్ నుండి బెంగుళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కరోనా సోకిన పేషంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన  సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

వైరల్: టాలీవుడ్ డైరెక్టర్ కి కరోనా.. అసలు నిజమేంటంటే..?

సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతడిని దూరంగా ఉంచి, నాణ్యతా ప్రమాణాలతో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏమాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని కోరారు.

జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు భావించాలని... వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్‌ లేదని.. మందులు వాడితే సరిపోతుందని భ్రమ పడొద్దని వెంటనే ఆస్పత్రికి వెళ్లండని సూచించారు. చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కులు తప్పని సరిగా వాడండి అంటూ జాగ్రత్తలు చెప్పారు. మాంసం తినడం వల్ల  కరోనా సోకదని.. మాంసాన్ని బాగా ఉడికించి తినాలని చెప్పారు.