టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. వెండి తెరపై అలీ ప్రత్యేకమైన మేనరిజమ్స్, హాస్యం కోసం ఉపయోగించే ఊతపదాలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో లాక్ డౌన్ అమలులో ఉంది. 

దీనితో సామాన్య ప్రజలతో పాటు సినీ సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ తారల ఇళ్లలో పనులంతా పనివారే చూసుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కరోనా కారణంగా పని వారు రావడం లేదు. దీనితో సెలెబ్రిటీలు అయినప్పటికీ ఎవరి పనులు వారే చేసుకోవాల్సి వస్తోంది. 

ముద్దుల్లో ఈమెకు పదికి పది మార్కులట..మిస్ ఇండియా ఊరకే అవుతుందా

దీనితో కమెడియన్ అలీ తన భార్యకు సాయం అందించేందుకు రంగంలోకి దిగాడు. భార్యకు తోడుగా ఇంటి పని వంటపని చేసేస్తున్నాడు. తాజాగా అలీ తన ఇంటిని శుభ్రపరుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అలీ దీనిపై మాట్లాడుతూ.. రోజూ కార్లు కడుగుతున్నా.. వంటింట్లో కూరగాయలు కట్ చేస్తున్నా.. ఇక మా ఆవిడ ఏది చెబితే అది చేయడమే అని అలీ అన్నాడు. బ్యాచిలర్ గా రూమ్ లో ఉన్నప్పుడు నేను వంట చేసేవాడిని.. బట్టలు ఉతికేవాడిని అని అలీ తెలిపాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో పూలమొక్కలు నీళ్లు పడుతూ కనిపించాడు.