కెరీర్ ఆరంభంలో తన హుషారైన నటనతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ చూసి మరో రవితేజ అని ప్రశంసలు కూడా కురిపించారు. ఉయ్యాలా జంపాల చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.  

కానీ ఇటీవల రాజ్ తరుణ్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. దీనితో రాజ్ తరుణ్ కెరీర్ సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు కెరీర్ పరంగా డూ ఆర్ డై సిచ్యుయేషన్. గుండజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. 

మనస్తాపానికి గురైన ఏఆర్ రెహమాన్.. దుమ్మెత్తి పోసిన లిరిసిస్ట్!

ఈ చిత్రం దాదాపుగా పూర్తయింది. ఇక రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో కరోనా వచ్చి పడింది. చిన్న సినిమా రిలీజ్ డిలే అయితే నిర్మాతలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ చిత్రాన్ని ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రానికి రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదని టాక్. సినిమా హిట్ అయితే ఇవ్వాలనే ఆలోచనలో నిర్మాతలు కూడా ఉన్నారు. కానీ ఈ చిత్రం థియేటర్ రిలీజ్ కాకుంటే రాజ్ తరుణ్ కెరీర్ కు దెబ్బ పడినట్లే. మరి నిర్మాతలు కరోనా ప్రభావం తగ్గేవరకూ వేచి చూస్తారా లేదా ఓటిటి వైపే మొగ్గుచూపుతారా అనేది చూడాలి.