సినిమాలు రీమేక్ చేయడం.. పాటలు రీమిక్స్ చేయడం ఎప్పటికి కత్తిమీద సామే. ఒరిజినల్ వర్షన్ తో తప్పకుండా పోలికలు పెడతారు. ఒరిజినల్ వర్షన్ ని మించే విధంగా ఉంటేనే రీమేక్ లకైనా, రీమిక్స్ లకైనా సిద్ధపడాలి. తాజాగా ఈ విషయం మసక్కలి 2.0 సాంగ్ కంపోజర్స్ కి భోదపడిఉంటుంది. 

బాలీవుడ్ నటులు సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా నటించిన మసక్కలి 2.0 సాంగ్ ఇటీవల విడుదలయింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సాంగ్ ని ఢిల్లీ 6 చిత్రంలో రెహమాన్ కంపోజ్ చేసిన మసక్కలి సాంగ్ నుంచి రీమిక్స్ చేశారు. 

 

ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టే విధంగా రీమిక్స్ సాంగ్ ఉండడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ పై రెహమాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. 

6 నెలల క్రితమే లీక్ చేసిన అల్లు అర్జున్.. తెలివిగా మ్యానేజ్ చేశాడు!

'ఒక మంచి పాటని రూపిందించడానికి ఎలాంటి అడ్డ దారులు ఉండవు. చాలా శ్రమించాలి. నిద్రలేని రాత్రులు గడపాలి. కేవలం ఒక్క పాటనే పలుమార్లు మార్చి మార్చి కంపోజ్ చేయాల్సి ఉంటుంది. మసక్కలి సాంగ్ కోసం ఏకంగా 200 మంది సంగీతకారులు శ్రమించారు. ఒక్కసారి మసక్కలి ఒరిజినల్ సాంగ్ విని ఆనందించండి' అని పాట లింక్ ని రెహమాన్ పోస్ట్ చేశాడు. 

ఈ సమయంలో రెహమాన్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా మసక్కలి ఒరిజినల్ లిరిసిస్ట్ ప్రసూన్ జోషి కూడా స్పందించారు. మసక్కలి 2.0 పై దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ 6 కోసం తాను రాసిన మసక్కలి పాటతో పాటు అన్ని పాటలు నా హృదయానికి బాగా దగ్గరైనవి. రెహమాన్, నేను కష్టపడి రూపొందించిన మసక్కలి పాటని కొందరు దుర్వినియోగం చేశారు. అభిమానులు ఒరిజినల్ వర్షన్ నే ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశాడు.