కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సెట్స్ లో ఘోరప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. 

శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు. విచారణకు రావాలని శంకర్, కమలహాసన్, క్రేన్ ఆపరేటర్ లతో పాటు క్రేన్ యజమాని, ప్రొడక్షన్ మేనేజర్ లకు నోటీసులు పంపించారు.

Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

గత వారం దర్శకుడు శంకర్ పోలీసులు ముందు హాజరు కాగా.. ఈరోజు నటుడు కమల్ హాసన్ ని చెన్నై పోలీసుల ముందు హాజరయ్యారు. కొంతసేపటి వరకు పోలీసులు కమల్ ని ప్రశ్నించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే మృతుల కుటుంబాలకు కమల్, శంకర్, చిత్ర నిర్మాతలు ఆర్ధిక సాయం అందించారు.

దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. శంకర్ అనుకోగానే ఈ చిత్రం ప్రారంభం కాలేదు. ఎన్నో సమస్యలని అధికమించి శంకర్ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు.