కమెడియన్ నుంచి హీరోగా మారి మళ్లీ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న నటుడు సునీల్. ఆయన రీసెంట్ గా అనారోగ్యంతో హాస్పటిల్ లో అడ్మిట్ అయ్యాడనేది తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆయనపై మరో రూమర్ మీడియాలో ప్రసారం అయ్యింది. లేటెస్ట్ గా సునీల్ చనిపోయాడు అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు ప్రసారం అయ్యాయి. దాంతో  షాకైన సునీల్ వెంటనే స్పందించాడు.

సునీల్ మాట్లాడుతూ... "నేను బ్రతికే ఉన్నాను. క్షేమంగానే ఉన్నాను. విజయవాడలో ఉన్నాను. ఓ  సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. నా హెల్త్ పై వస్తున్న వార్తలు విని కొందరు స్నేహితులు ఆందోళన చెందుతున్నట్లు నాకు తెలిసింది. అటువంటి రూమర్స్ నమ్మవద్దు. అల్ ఈజ్ వెల్," అంటూ సునీల్ వివరణ ఇచ్చారు.

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సునీల్

సునీల్ పై ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ప్ర‌ముఖ తెలుగు న‌టుడు సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్ ప్ర‌సారం చేసింది. అది ఇటూ అటూ తిరిగి చివ‌రికి ఇండ‌స్ట్రీలో వేగంగా వ్యాపించింది. అదేంటి.. సునీల్ చ‌నిపోవ‌డం ఏంటి.. అత‌డికి యాక్సిడెంట్ కావ‌డం ఏంటి అంటూ అంతా కంగారు ప‌డ్డారు.  అప్పుడు కూడా సునీల్ ...తాను బతికే ఉన్నాను అని బుజువు చేసుకునే విధంగా ప్రకటన చేయాల్సి వచ్చింది.