Asianet News TeluguAsianet News Telugu

తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన సునీల్

సునీల్ అనారోగ్యంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరారు. నేటి ఉదయం ఉంచి సునీల్ ఆరోగ్యానికి సంబందించిన అనేక రకాల వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేశాయి.  సునీల్ ని  గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి చేర్పించారు. అయితే వార్తలు మరీంత వైరల్ కాకముందే సునీల్ తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు. 

comedian sunil about his health situation
Author
Hyderabad, First Published Jan 23, 2020, 12:46 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ కమెడియన్ సునీల్ అనారోగ్యంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరారు. నేటి ఉదయం ఉంచి సునీల్ ఆరోగ్యానికి సంబందించిన అనేక రకాల వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేశాయి. సునీల్ ని  గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి చేర్పించారు. అయితే వార్తలు మరీంత వైరల్ కాకముందే సునీల్ తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు.

సునీల్ మాట్లాడుతూ.. 'నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను అని వివరణ ఇచ్చారు'. గత వారం రోజులుగా సునీల్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఎక్కువగా  బయోటిక్స్ వాడినట్లు సమాచారం. అయితే దాని కారణంగా గొంతులో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కావడంతో రాత్రి సునీల్ ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది.

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు సునీల్ ని గచ్చిబౌలిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సునీల్ మాటలో కూడా కాస్త తేడా రావడం నీరసంగా ఉండడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది.   ప్రస్తుతం సునీల్ కి వైద్యులు చిక్కిత్స అందిస్తున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. ఇక రేపు విడుదల కాబోయే డిస్కో రాజా సినిమాలో కూడా సునీల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. అనారోగ్య కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నట్లు సునీల్ ఇటీవల మీడియాకు తెలియజేశారు. ఇక మొత్తానికి సునీల్ ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదని అభిమానుల ముందుకు ఆయన త్వరలోనే వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios