తెలుగులో హాస్యనటుడుగా పరిచయమై హీరో అవతారమెత్తిన కమెడియన్ సప్తగిరి సక్సెస్ వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మొదలుకుని నిన్న మొన్నటి 'వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌' దాకా ఒక్కటి హిట్ కాలేదు. అయినా తన ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు మరో ఇద్దరితో కలిసి మరో కామెడీ సినిమాకు శ్రీకారం చుట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ (RTF)పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ చిత్రం “తాగితే తందానా”. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ చిత్రం ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, బ్యానర్ లోగో లాంచ్ కార్యక్రమం నవంబర్ 7న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఫస్ట్ లుక్ ని దర్శకుడుమారుతి ఆవిష్కరించారు..
 
 దర్శకుడు మారుతి మాట్లాడుతూ..   ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే  ఎగ్జైటింగ్ గా అనిపించింధి. ఈ నిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు  కొత్త కాన్సెప్టులతో వస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఆదిత్, మధు, సప్తగిరి ముగ్గురు కలిసి ఆడియెన్స్ ని ఎంటర్ టైం చేయడానికి వస్తున్నారు. వాళ్ళ లుక్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.  సప్తగిరి హీరోగా చేస్తూనే ఈ సినిమాలో కమేడియన్ గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడం వెరీ హ్యాపి. అన్నారు.

ఈ వారం ట్రేడ్ టాక్.. ఊహించినంత లేదు!
 
 సప్తగిరి మాట్లాడుతూ.. ఒక పక్క హీరోగా చేస్తున్నాను. కమీడియన్ గా మంచి చిత్రాలు వస్తే చేద్దాం అనుకుంటున్నా తరుణంలో శ్రీనాథ్ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కళ్ళు మూసుకొని ఈ సినిమా చేసేశాను. ఫుల్ లెంగ్త్ కామిడీ రోల్ ప్లే చేశాను. కొత్త కాన్సెప్ట్ తో శ్రీనాథ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అలాగే నిర్మాతలు కొత్తవాళ్ళైనా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ టీమ్ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆదిత్, మధు నేను కలిసి చేసిన ఈ సినిమా కచ్చితంగా  ప్రేక్షకులను అలరిస్తుంది. నిర్మాతలు మంచి  లాభాలతో సేఫ్ గా బయటపడతారని ఆశిస్తున్నాను.. అన్నారు.
 
ఆదిత్, సప్తగిరి, సిమ్రాన్ గుప్తా, మధునందన్, సుప్రియ, బాహుబలి ప్రభాకర్, సత్యం రాజేష్, రవి వర్మ, ప్రభాస్ శ్రీను, సమీర్, డివి నాయుడు, మాణిక్ రెడ్డి, శ్రీ సుధా, విష్ణు హాలివుడ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఫై.బాల్ రెడ్డి, ఎడిటర్: బి.నాగిరెడ్డి, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, ఆర్ట్: తిరుమల ఎం.తిరుపతి, కొరియోగ్రఫీ: యశ్వంత్, లిరిక్స్: వారికుప్పల యాదగిరి, గోశాల రాంబాబు, రామాంజనేయులు, కో-డైరెక్టర్: చిన్న,ప్రొడక్షన్ కంట్రోలర్: గంగాధర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: అనిల్ పాలెపు, నిర్మాతలు: వి.మహేష్, వినోద్ జంగపల్లి, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని.