Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం ట్రేడ్ టాక్.. ఊహించినంత లేదు!

మొదటిరోజే వీక్ గా మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ఆ తరువాత కూడా అదే రీతిన కొనసాగింది. విజయ్ కి లాభాలు వచ్చినా కానీ థియేటర్ ఫీడింగ్ కి మాత్రం ఈ సినిమా ఉపయోగపడలేదు. 

This Week Box office trade talk
Author
Hyderabad, First Published Nov 8, 2019, 5:17 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ చాలానే శ్రమ పడ్డాడు. తానే స్వయంగా ఓ ప్రచార పాటను కూడా చేశాడు.

కానీ ఎంత చేసినా.. ఈ సినిమాకి సరైన బజ్ మాత్రం రాలేదు. మొదటిరోజే వీక్ గా మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ఆ తరువాత కూడా అదే రీతిన కొనసాగింది. విజయ్ కి లాభాలు వచ్చినా కానీ థియేటర్ ఫీడింగ్ కి మాత్రం ఈ సినిమా ఉపయోగపడలేదు. ఈ సినిమాతో పాటు విడుదలైన రవిబాబు 'ఆవిరి' సినిమా నిజంగానే ఆవిరైపోయింది.

మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది.. మిగిలిన వాళ్లకు ఆ అర్హత కూడా లేదు: ఆర్జీవీ!

ఈ సినిమాకి కనీసం పోస్టర్ల ఖర్చు కూడా రానంత దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం దిల్ రాజుని రంగంలోకి దింపినా ఉపయోగంలేకుండా పోయింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో డబ్బింగ్ సినిమాలు 'విజిల్', 'ఖైదీ'లకు కలెక్షన్స్ పెరిగాయి. ఈ రెండు సినిమాలకు తెలుగులో లాభాలు వచ్చాయి.

ఇక ఈ వారం శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం'తో పాటు మరో డీగ్రేడ్ సినిమా 'ఏడు చేపల కథ' బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. బూతు ప్రోమోలు, పోస్టర్లతో బజ్ తెచ్చుకున్న 'ఏడు చేపల కథ' సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చీప్ ట్రిక్స్ తో ఈ బూతు సినిమాను ఆడియన్స్ మీద రుద్దాలను భావించారు.

కానీ వర్కవుట్ కాలేదు. ఈ సినిమా చూసిన జనాలు మేకర్లను తిట్టిపోస్తున్నారు. ఎరోటిక్ థ్రిల్లర్పేరుతో ఇంతగా దిగాజారుతారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసపు ప్రొడక్షన్ వాల్యూస్ లేని ఈ సినిమా తొలిరోజే చతికిలపడింది.

ఇక శ్రీవిష్ణు నటించిన 'తిప్పరామీసం' సినిమా ట్రైలర్ బాగుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ వారంలో కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా రాలేదనే చెప్పాలి!
 

Follow Us:
Download App:
  • android
  • ios