Asianet News TeluguAsianet News Telugu

కమెడియన్ అలీ.. ఈ స్దాయిలో షాక్ ఇచ్చాడేంటి..?

దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైంది. జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రం టీమ్ మీడియాకు వెల్లడించింది. 

Comedian Ali to next in Hollywood
Author
Hyderabad, First Published Jan 29, 2020, 3:00 PM IST

బాల నటుడుగా కెరీర్ మొదలెట్టి, క్యారక్టర్ ఆర్టిస్ట్,కమెడియన్ గా తనకంటూ స్దానం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత హిరోగా,టెలివిజన్ హోస్ట్ గా విభిన్న పాత్రలలో తనేంటో ప్రూవ్ చేసుకున్నారు అలీ. తనదైన శైలిలో సామాజిక సేవ చేస్తూ ఈ మధ్యన రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’లో కానిస్టేబుల్ రాజుగా కనిపించిన అలీ త్వరలో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకుని అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు.  దాంతో టాలీవుడ్ లో ఈ వార్త సెన్సేషన్ గా మారింది. అలీ సన్నిహితులు చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సోషల్ మీడియా దీన్ని ఓ షాకింగ్ న్యూస్ గా అభివర్ణిస్తోంది.
 
దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో అలీ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైంది. జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను చిత్రం టీమ్ మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దానేటి కావటం విశేషం.

'అల.. వైకుంఠపురములో'.. బన్నీకి వచ్చిందెంత...?

ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ పనులు, అనుమతుల నిమిత్తం నటుడు అలీ, దర్శకుడు జగదీష్‌.. సమాచార, ప్రసారల శాఖమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిశారు.

అలీ మాట్లాడుతూ.. ‘నేను హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉంది. హాలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడని భావిస్తున్నాను. మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.

జగదీష్‌ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుంది. అలీ గారిని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios