స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమాకి అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ఈ సినిమాకి బన్నీ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు..? ఈ సినిమాతో అల్లు ఫ్యామిలీకి ఎంత సంపద సమకూరిందనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.24 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.

అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్.. కాస్ట్లీ కార్లు!

ఇది కాకుండా గీతా సంస్థకి వచ్చే లాభాల్లో నలభై శాతం వాటా కూడా అందుతుందని తెలుస్తోంది. సినిమాకి పెట్టుబడి పెట్టి, నిర్మించిన హారికా హాసినికి అరవై శాత వాటా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాణానికి ముందు లాభాలు, తరువాత ఓవర్ ఫ్లోస్ అన్నీ కలిపి కనీసం నలభై కోట్ల వరకు లాభాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

అంతే ఆ విధంగా గీతా సంస్థకి కనీసం 16 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అల్లు ఫ్యామిలీకి రూ.24 కోట్లు ప్లస్ రూ.16 కోట్లు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రెండు ఏరియాలను గీతాసంస్థ రేటు కట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. అక్కడ ఇరవై శాతం కమీషన్ కూడా వస్తుంది. ఇలా చూసుకుంటే అన్ని విధాలుగా అల్లు ఫ్యామిలీకి 'అల.. వైకుంఠపురములో' సినిమా కలిసొచ్చింది.