స్టాండప్ కామెడీ పేరుతో స్టార్ హీరోలపై కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నామధ్య మహేష్ బాబు యాక్టింగ్ పై విమర్శలు చేశాడని ఓ స్టాండప్ కమెడియన్ ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. తాజాగా మరో స్టాండప్ కమెడియన్ అలెగ్జాండర్‌ బాబు.. సీనియర్ హీరో బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా 
మారాయి.

యూట్యూబ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలెగ్జాండర్‌.. తన కాన్సెప్ట్ ల కోసం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తుంటారు. అయితే అతడు వేసే పంచ్ లు, సెటైర్లు సాఫ్ట్ గానే ఉంటాయ్ కాబట్టి ఇప్పటివరకు వివాదాలకు దారి తీయలేదు. ఆ కామెడీని ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అతని వీడియోలకు మిలియన్ల వ్యూస్‌ దక్కుతాయంటే అతనికి ఎంతగా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుడిగాలి సుధీర్ ని రిజెక్ట్ చేశా.. వాడి గురించి మా ఫ్రెండ్స్ కి తెలుసు.. హీరోయిన్ కామెంట్స్!

తాజాగా అలెగ్జాండర్‌ప్రముఖ సింగర్స్ ఏసుదాసు, ఎస్పీ బాలసుబ్రమణ్యంల కోసం ట్రిబ్యూట్ గా  వీడియోలు రూపొందించారు. ఏసుదాసుకు నివాళిగా అర్పించిన వీడియోలో బాలకృష్ణ టాపిక్ తీసుకొచ్చి అతడిపై విమర్శలు చేశారు. 'ఎన్నో రాత్రులొస్తాయి కానీ' అనే పాటలో బాలకృష్ణ తన స్టెప్పులతో భయపెడతాడని.. ఆ పాటను పొరపాటున కూడా చూడొద్దంటూ ఆడియన్స్ కి చెప్పాడు.

ఈ పాటలో ఎస్పీ బాలు వాయిస్ బాగుంటుందని కానీ పిక్చరైజేషన్ చూస్తే మాత్రం పారిపోతారంటూ విమర్శలు చేశాడు. బాలయ్య డాన్స్ చేస్తుంటే పక్కన ఉన్న హీరోయిన్లు.. 'మాస్టర్ ఈ స్టెప్పు చెప్పనేలేదనుకుంటారని' అలా బాలయ్య తనకు ఇష్టం వచ్చినట్లుగా డాన్స్ చేస్తుంటాడని.. అతని డాన్స్ చూసి హీరోయిన్లు బెంబెలెత్తుతారని అన్నాడు.

మిడ్‌నైట్‌ మసాలా హీరోయిన్లు కూడా బాలకృష్ణ స్టెప్పులు చూసి పరుగులు తీస్తుంటారని ఇష్టమొచ్చినట్లువాగేశాడు. ఈ జోకులకు అక్కడ జనం నవ్వుతున్నప్పటికీ బాలయ్య అభిమానులు మాత్రం హర్ట్ అవుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే స్టేజ్ మీద బాలయ్య బాబుపై కామెంట్స్ వేస్తావ్..? అంటూ అలెగ్జాండర్‌ పై మండిపడుతున్నారు. మరి దీనిపై అలెగ్జాండర్‌ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!