టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ని, సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని తీసుకుంటారు. 'ఆర్య' సినిమా నుండి వీరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మధ్యలో ఒకట్రెండు సినిమాలకు తప్పక కెమెరామెన్ ని మార్చారే గానీ సుక్కుకి మాత్రం రత్నవేలు సినిమాటోగ్రఫీ అంటేనే ఇష్టం. అలాంటిది ఇప్పుడు సుకుమార్ చేయబోతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి రత్నవేలు పని చేయడం లేదు.

రత్నవేలు ఇప్పటికే 'భారతీయుడు 2' సినిమాకి కమిట్మెంట్ ఇవ్వడంతో సుక్కు, బన్నీ సినిమాకి డేట్లు కేటాయించలేకపోయాడు. అనుకున్న సమయానికి ఈ సినిమా మొదలు కాకపోవడంతో రత్నవేలు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోక తప్పలేదు. సుకుమార్ కొత్త సినిమాలో తాను పని చేయడం లేదనే విషయాన్ని రత్నవేలు స్వయంగా ప్రకటించాడు.

ఆ హీరోయిన్ పై కోన వెంకట్ స్పెషల్ ఇంటరెస్ట్.. మ్యాటరేంటో..?

మరి ఇప్పుడు రత్నవేలు స్థానలో ఎవరు పని చేయబోతున్నారంటే.. 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మిరస్లోవ్ కూబా అని తెలుస్తోంది. ఇతడు పోలెండ్ దేశానికి చెందినవాడు. ఇక్కడ కెమెరామెన్ లు చాలా మంది ఉంటారు.

తక్కువ రెమ్యునరేషన్ కే పని చేశారట. 'గ్యాంగ్ లీడర్' సినిమాలో తనదైన పనితనం చూపించిన కూబా.. సుక్కు-బన్నీ సినిమాకి కోటి 25 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్  తీసుకుంటున్నాడు. అదే రత్నవేలుకైతే.. రూ.3కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది.

మిరస్లోవ్ కూబా తక్కువ రెమ్యునరేషన్ కే బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వగలరని నమ్ముతున్నారు. ఈ లెక్కన చూసుకునే నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీస్' వారికి రెండు కోట్ల ఖర్చు తగ్గిందనే చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.