Asianet News TeluguAsianet News Telugu

'ప్రతిరోజూ పండగే' ట్విట్టర్ రివ్యూ!

సినిమాకి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమా కొత్తగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడడంతో సినిమా టాక్ ఏంటో బయటకి వచ్చింది. 

sai tej's prathiroju pandage movie twitter review
Author
Hyderabad, First Published Dec 20, 2019, 9:48 AM IST

మెగాహీరో సాయి తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. సత్యరాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'చిత్రలహరి' లాంటి హిట్ సినిమా తరువాత సాయి తేజ్ నటించిన సినిమా కావడంతో 'ప్రతిరోజూ పండగే'పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సినిమాకి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమా కొత్తగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది.

ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడడంతో సినిమా టాక్ ఏంటో బయటకి వచ్చింది. సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని, సాయి తేజ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుందని చెబుతున్నారు.

సాయి తేజ్ కి తాత పాత్రలో సత్యరాజ్ మెప్పించారని.. రావు రమేష్ నటన మరో స్థాయిలో ఉండదని అంటున్నారు. అయితే కథలో కొత్తదనం ఏమీ లేదని, కేవలం కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ తో దర్శకుడు సినిమాని నడిపించారని.. సెకండ్ హాఫ్ మొత్తం డల్ గా ఉందని అంటున్నారు.

సినిమాలో ఆశించిన అంశాలు పెద్దగా లేవని పెదవి విరుస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తే.. సెకండ్ హాఫ్ మాత్రం సాగదీశారని, క్లైమాక్స్ కూడా సో సో గా ఉందని అంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios