మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ అందుకున్నాయి. 'బావగారు బాగున్నారా..?', 'చూడాలనివుంది', 'ఇద్దరు మిత్రులు', 'అన్నయ్య', 'మృగరాజు, 'ఇంద్ర', 'ఠాగూర్', 'అంజి', 'జై చిరంజీవ', 'స్టాలిన్' ఇలా చిరు నటించిన చాలా సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు.

ఈ సినిమాల్లో కొన్ని  ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజికల్ మాత్రం అన్నీ హిట్సే.. ఏ సినిమాలో కూడా మ్యూజిక్ బాలేదనే కంప్లైంట్ లేదు. దీన్ని బట్టి వీరి కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అనేది చెప్పొచ్చు. ఇన్ని హిట్స్ ఉన్నప్పటికీ ఏరోజు కూడా మణిశర్మ మిగిలిన సంగీత దర్శకుల మాదిరి తన ఆడియోల గురించి సోషల్ మీడియాలో అతిగా ప్రచారం చేయడం వంటివి చేయలేదు. 

పెళ్లి తరువాత ఘాటు రొమాన్స్.. బన్నీతో సై అంటోన్న రష్మిక!

వీటిలో చాలా సినిమాలకు కనీసం ఆడియో ఫంక్షన్లు కూడా చేసుకోలేదు. తెర వెనుకే ఉంటూ తన పని తాను చేసుకుంటూపోయాడు. అయితే 'స్టాలిన్' సినిమా చేస్తోన్న సమయం నుండే మణిశర్మలో జోరు తగ్గిందనే విమర్శలు వినిపించాయి. దీంతో స్టార్ హీరోలంతా మణిశర్మని పక్కన పెట్టేశారు. చిరు కూడా సినిమాలు చేయడం తగ్గించడంతో మణిశర్మకి 
అవకాశాలు ఇవ్వలేకపోయాడు.

ఇప్పుడు చాలా ఏళ్ల తరువాత చిరంజీవి సినిమాకి సంగీతం అందించే ఛాన్స్ మణిశర్మకి దక్కిందని టాక్. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మకి తీసుకుంటున్నారని టాక్. మొదట కొందరు బాలీవుడ్ సంగీత దర్శకుల పేర్లు పరిశీలించినప్పటికీ.. చిరంజీవి మాత్రం మణిశర్మ వైపే మొగ్గు చూపారట.

చిరు సినిమా అంటే మణిశర్మ ఇచ్చే బీజియమ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. గతంలో మణిశర్మ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పని చేసే ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ లేకుండా పని చేస్తానని చెప్పారు. తన పెర్సనల్ స్టాఫ్ కి కూడా సొంతంగా డబ్బులు ఇచ్చుకుంటానని చెప్పారు.

ఇది ఆయనకి చిరు మీదున్న అభిమానానికి నిదర్శనం. సంగీతం పరంగా మణిశర్మ జోరు తగ్గి ఉండొచ్చు కానీ ఆయన ఫేడవుట్ అవ్వలేదు. మంచి ఛాన్స్ వస్తే తన సత్తా ఏంటో ఇప్పటికే రుజువు చేశాడు. ఇప్పుడు కొరటాల, చిరంజీవి లాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే మణిశర్మ బీజియమ్స్ మాములుగా ఉండవని అభిమానులు ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి!