స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ లొకేషన్స్ వెతికే పనిలో పడ్డాడు.

దాదాపు స్క్రిప్ట్ పనులను మొత్తం ఇటీవల ముగించుకున్న సుక్కు వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా కథ తిరుపతి బ్యాక్ గ్రౌండ్ లో మొదలవుతుందని గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ అడవుల్లో స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా రఫ్ లో కనిపిస్తాడని అంటున్నారు.

తెలుగు లోగిళ్లలో దీప అలియాస్ వంటలక్క: ఎవరీ ప్రేమీ విశ్వనాథ్?

ఈ లుక్ మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని ఇన్ సైడ్ టాక్. సినిమాకు సంబంధించిన చాలా సీన్స్ అడవుల్లో చిత్రీకరిస్తారట. అందుకోసం తిరుపతిలోని కొన్ని ప్రాంతాలను దర్శకుడు పరిశీలిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని సుక్కు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కొన్ని ఎపిసోడ్ లను హైలైట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. అందులో బన్నీ, రష్మికల రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. సినిమాలో వీరిద్దరూ భార్యా, భర్తలుగా కనిపిస్తారట. పెళ్లి తరువాత వీరిద్దరి మధ్య కొన్ని ఘాడమైన రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ ఇప్పటివరకు వెండితెరపై హజ్బండ్ పాత్రలు చేసింది లేదు. మొదటిసారి ఆ తరహా పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.