బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ కి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ , వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజాలలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి కలుగుతోంది. ఇది ఇలా ఉండగా.. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటినుండే గ్రాండ్ ఫినాలేకి కసరత్తులు మొదలుపెట్టారు. దీనికోసం ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బిగ్ బాస్ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

ఫినాలే ఎపిసోడ్ ని మరింత రక్తి కట్టించడానికి చిరుని వేదిక మీదకు రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయన చేతుల మీదుగానే విజేతకి టైటిల్ అందజేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరుతో పటు పలువురు హీరోయిన్లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్, అంజలి గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక ఆకర్షణగా మెరిసిపోనున్నారనే వార్తలు  వినిపిస్తున్నాయి.

bigg boss 3: 50లక్షలు మాకే.. ఫైనల్ పై వితిక కామెంట్స్

ఇప్పటికే నిధి ఓసారి బిగ్ బాస్ షోకి వెళ్లింది. తను నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్.. రామ్ తో కలిసి బిగ్ బాస్ షోలో సందడి చేసింది. ఇప్పుడు మరోసారి సందడి చేయనుంది. ఇక చిరంజీవి బిగ్ బాస్ నిర్వాహకుల ఆహ్వానానికి అంగీకారం తెలిపాడా లేదా అనే విషయంపై అధికార ప్రకటన రావాల్సివుంది.

ఇది ఇలాఉండగా.. బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతోన్న శ్రీముఖి, బాబా, రాహుల్, వరుణ్, అలీలలో ఓటింగ్ ప్రకారం.. అలీ రెజా, బాబా భాస్కర్ లు వెనుకబడి పోయారని సమాచారం. వరుణ్ కి కూడా ఓ మోస్తరుగానే ఓట్లు పడుతున్నాయి. రాహుల్, శ్రీముఖిల మధ్య పోరు జరుగుతోంది. మరి వీకెండ్ లోపు ఏం జరుగుతుందో చూడాలి!