ప్రముఖ సినీ దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాదిరాళ్లు'.

ఈ సినిమాని రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకి మొదటి సినిమా ఇదే. తొలి చిత్రంతోనే ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న చిరంజీవి.. ఇటీవల ఆయనకి అపోలో హాస్పిటల్ లో చికిత్స చేయించారు.

యువ నటుడు ఉదయ్ కిరణ్ మృతి!

కొన్ని రోజుల క్రితమే రాజ్ కుమార్ పెద్ద కుమారుడు చనిపోయారు. ఆ తరువాత భార్య కూడా మృతి చెందడంతో ఆయన మరింత కుంగిపోయారు. రాజ్ కుమార్ స్వస్థలం కృష్ణాజిల్లా ఉయ్యూరు. ఇప్పుడు ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు తరలించడానికి చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు.