మెగా స్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి, జ్యోతిక, శ్రియ, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషించారు. దేశంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అవినీతి, అంచగొండి తనాన్ని టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం అప్పట్లో భారీ సంచలనానికి తెర తీసింది.

also read:ఆరుపదుల వయసులో జిమ్ వర్కౌట్.. మెగాస్టార్ డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా!

ఆ సినిమా చిరు ఇమేజ్ ను ప‌దింత‌లు చేసింది. ఠాగూర్ నింపిన‌ స్ఫూర్తితోనే ఆయ‌న‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అభిమానులు చెబుతారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే అక్కడా బాగానే ఆడింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా కాలంగా నలుగుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రానికి కథ అంటూ ప్రచారం మొదలైంది.    సైరా వంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత  చిరంజీవి  హీరోగా న‌టిస్తోన్న 152వ చిత్రం క‌థ ఇదేనంటూ ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే వీటిలో స‌రైన‌ క్లారిటీతో నిజం అనిపించలేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఇదీ క‌థ అంటూ మరొకటి ప్రచారంలోకి వచ్చింది.  ఇదో పొలిటికల్ పొలిటిక్ థ్రిల్లర్ అని, న‌క్సలిజం బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అని, ఠాగూరు క‌థ‌కు ద‌గ్గరగా ఉంటుంద‌ని, ఓ రకంగా సీక్వెల్ అని ఇలా కొన్ని రూమ‌ర్లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఠాగూర్ ఒరిజనల్ కథ తమిళంలో మురగదాస్ రాసింది. అక్కడ రమణ టైటిల్ తో వచ్చి హిట్టైంది. సీక్వెల్ ప్లాన్ చేయాలంటే మొదట అక్కడ మురగదాస్ చేస్తారు. అలాగే వివి వినాయిక్ ని సీన్ లోకి దింపుతారు.

అంతేకానీ ఒరిజనల్ కథలతో తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ చేసుకున్న కొరటాల శివ ఎందుకు..వేరే వారు చేసిన సీక్వెల్ ని ముందుకు తీసుకెళ్తారు అనేది ఆలోచిస్తే ఈ రూమర్ ఎంత అర్దం లేనిదో అర్దం అయ్యిపోతుంది.  ఇక ఈ రూమర్స్ ప్రకారం చిరంజీవి ఎండోమెంట్ (దేవాల‌యాల శాఖ‌) డిపార్ట్ మెంట్ లో ప‌నిచేసే ప‌వ‌ర్‌ఫుల్  అధికారి పాత్రలో క‌నిపించ‌నున్నార‌ని, ఆ శాఖ‌లో జ‌రిగే అవినీతి పై చిరు స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నార‌ని వినిపిస్తోంది.  

`గోవింద హ‌రి గోవింద` అనే టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో చిరు రోల్ క‌చ్చితంగా అదే అయ్యి ఉంటుంద‌ని అంటున్నారు. ఇర ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అజ‌య్ -అతుల్ ద్వయమ  సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో అనేర బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌కు సంగీతం అందించిన కాంబో అది. మ‌రాఠా బ్లాక్ బ‌స్టర్ సైరాట్ కి ఈ ద్వయమే  సంగీతం అందించారు. మెగాస్టార్ 152తో ఆ ఇద్దరి పేర్లు ద‌క్షిణాదినా మార్మోగ‌డం ఖాయం అంటున్నారు.