మెగాస్టార్ చిరంజీవి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన సంగతి తెలిసిందే. తన స్పీచ్ తో ఆడియన్స్ అందరినీ నవ్వించాడు. కానీ చిరు కారణంగా నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని సమాచారం.

దానికి కారణం చిరంజీవి సంక్రాంతి సినిమాల లిస్ట్ చదువుతూ నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాని మర్చిపోయారు. 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పిన చిరు 'అల.. వైకుంఠపురములో' ప్రస్తావన తీసుకొచ్చారు.

స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

ఆ తరువాత 'దర్బార్' సినిమా పేరుని గుర్తు చేశారు దర్శకుడు అనీల్ రావిపూడి. దీంతో చిరు తన స్నేహితుడి సినిమా అంటూ అది కూడా సక్సెస్ కావాలని అన్నారు. ఇవి కాకుండా చాలా సినిమాలు వస్తున్నాయన్నారే తప్ప కళ్యాణ్ రామ్ 'ఎంతమంచి వాడవురా' పేరు మాత్రం ప్రస్తావించలేదు. మరికొన్ని సినిమాలని కాకుండా కళ్యాణ్ రామ్ పేరు చెప్పి చిరు విషెస్ చెప్పి ఉంటే అది మరో లెవెల్ లో ఉండేది.

పోనీ చిరు మర్చిపోయినా.. కళ్యాణ్ రామ్ పేరు అనీల్ రావిపూడి కూడా గుర్తు చేయలేదు. దీనికి ఆయన ట్విట్టర్ లో సంజాయిషీ కూడా ఇచ్చారనుకోండి. కానీ టోటల్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ పేరు మర్చిపోయిన అంశం కాస్త ఫ్యాన్స్ ని ఇబ్బందికి గురిచేస్తోంది.

ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ చిరుని ట్రోల్ చేస్తున్నారు. అసలైన పండగ రోజు జనవరి 15న కళ్యాణ్ రామ్ సినిమా వస్తుందని దాన్ని ఎలా మర్చిపోయారంటూ ప్రశ్నిస్తున్నారు.