Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్ మన దేశం ఎంట్రీ 'ఛెల్లో షో' చైల్డ్ స్టార్ మృతి, షాక్ లో టీమ్

 'ఛెల్లో షో' సినిమా అక్టోబర్ 14న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తమ జీవితాలు మారతాయని తమతో చెప్పేవాడని, ఆ రోజు రాకుండానే,చూడకుండానే వెళ్లిపోయాడంటూ  అతని తండ్రి రాము కోలి (ఆటో డ్రైవర్) కన్నీరు పెట్టుకున్నారు. 

Child star of India Oscar entry Chhello Show dies days before movie release
Author
First Published Oct 11, 2022, 9:25 AM IST


గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ను ఆస్కార్ కు పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే. పదహారు మంది సభ్యులున్న ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఏకగ్రీవంగా 'ఛెల్లో షో'కు ఓటేసి ఆ సినిమాను భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్స్ కు పంపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి అంతటా చర్చలు జరిగాయి. రిజల్ట్ ఏమొస్తుంది..ఆస్కార్ వస్తుందా లేదా అన్నది ప్రక్కన పెడితే..ఈ చిత్రంలో నటించిన ప్రధాన పాత్రధారి రాహుల్ కోలి..కాన్సర్ తో చనిపోయారు. గుజరాత్ ..అహ్మదాబాద్ లోని కాన్సర్ హాస్పటిల్ లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్టోబర్ 2న మృతి చెందారు.

ఇక  'ఛెల్లో షో' సినిమా అక్టోబర్ 14న రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తమ జీవితాలు మారతాయని తమతో చెప్పేవాడని, ఆ రోజు రాకుండానే,చూడకుండానే వెళ్లిపోయాడంటూ  అతని తండ్రి రాము కోలి (ఆటో డ్రైవర్) కన్నీరు పెట్టుకున్నారు. రాహుల్ గత నాలుగు నెలలుగా గుజరాత్ కాన్సర్ రీసెర్చ్ ఇనిస్ట్రిట్యూట్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని ట్రీట్మెంట్ కోసం ఆటో రిక్షా అమ్మేసామని చెప్పారు. ఈ విషయం సినిమా టీమ్ కు తెలిసాక..తిరిగి వాళ్లు మా రిక్షాన్ని మాకు ఇప్పించారు అని బాధపడుతూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇక బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం తరఫున ఆస్కార్‌ నామినేషన్‌ పోటీకి గుజరాతీ ఫిల్మ్‌ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’) ఎంపికైంది. భవిన్‌ రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌ రావల్, పరేష్‌ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్‌ నలిన్‌ (నలిన్‌ కుమార్‌ పాండ్య) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 'ఛెల్లో షో' మొదటిసారిగా విడుదలైంది ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో. 10 జూన్ 2021 న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఛల్లో షో ను విడుదల చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో, అక్టోబర్ లో వెల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఛెల్లో షో' విడుదలైంది.

రాయ్‌కపూర్‌ ఫిల్మ్స్, ఆరెంజ్‌ స్టూడియో సమర్పణలో సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్, ధీర్‌ మోమయ్య, పాన్‌ నలిన్, మార్క్‌ డ్యూలే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘మా నాన్న నన్ను కొట్టారు. నేను సినిమా చూడటానికి వెళ్లానని’, ‘భవిష్యత్‌ స్టోరీ టెల్లర్స్‌దే’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఇక ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్‌ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్‌ అయ్యాడు? అన్నదే చిత్ర కథ.  

 ''ఈ సినిమా మన నేటివిటిని,  భారతీయతను చూపుతుంది. ఇది ఒక కుర్రాడి కథ. సినిమా ప్రపంచంలో ఏదైనా గొప్ప ఘనత సాధించాలని తాపత్రయపడే కుర్రాడి కథ ఇది. అతన్ని ఏదీ ఆపలేదు. 'మీరు మీ కలల కోసం కష్టపడితే, విజయం మిమ్మల్ని వరిస్తుంది' అనే సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. దీని కథనం కూడా చాలా సాధారణంగా సాగుతుంది'' అని దర్శకుడు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios