అయితే ఈ సినిమా కథ తన దగ్గర నుండి కాపీ కొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ రాకేశ్ భర్తీ అనే రచయిత కోర్టుని ఆశ్రయించాడు. 'ఛపాక్‌' చిత్ర రచయితల్లో తనను ఒకరిగా గుర్తించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటించిన 'ఛపాక్‌' సినిమా వివాదాలను ఎదుర్కొంటోంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ ని కూడా విడుదల చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ తన దగ్గర నుండి కాపీ కొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ రాకేశ్ భర్తీ అనే రచయిత కోర్టుని ఆశ్రయించాడు. 'ఛపాక్‌' చిత్ర రచయితల్లో తనను ఒకరిగా గుర్తించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డిఫరెంట్ టాలెంట్ తో యూ ట్యూబ్ లో క్లిక్కయిన స్టార్స్

యాసిడ్ బాధితురాలి కథను మొదట తాను రాశానని రాకేశ్ చెప్పుకొచ్చారు. దీనికోసం నటీనటులను సంప్రదించగా.. పలువురు అందులో నటించడానికి ఆసక్తి కనబరిచారని వెల్లడించారు. 'బ్లాక్ డే' అనే పేరుతో సినిమాను కూడా రిజిస్టర్ చేసుకున్నానని తెలిపారు. అయితే పలు కారణాల వలన సినిమా చిత్రీకరణ ఇంకా మొదలుపెట్టలేదని అన్నారు.

అయితే తాను రాసుకున్న కథను యథాతథంగా 'ఛపాక్'లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఛపాక్' చిత్ర రచయితగా తనను గుర్తింపు ఇచ్చేవరకు సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాడు.

ఈ విషయం గురించి మొదట చిత్ర నిర్మాతలను సంప్రదించినప్పటికీ, వారి నుండి ఎలాంటి స్పాదన రాకపోవడం వలనే కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని రాకేశ్ తెలిపారు. అయితే ఈ వివాదంపై 'ఛపాక్' యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.