తమ సినిమాను ప్రమోట్ చేసుకోవటానికి దర్శక,నిర్మాతలు విభిన్నమైన ఆలోచనలు చేస్తూంటారు. సినిమా చూసి ఇంటర్వెల్ లో విలన్ ఎవరో చెప్పినవారికి గిప్ట్ ఇస్తామని ఓ సినిమా టీమ్ రీసెంట్ గా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసింది. అయితే ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఓ దర్శక,నిర్మాత మరియు హీరో అయిన ఓ కుర్రాడు తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచితంగా ఇచ్చారు.

(2010-2019) కథలతో షాక్ ఇచ్చిన సినిమాలు.. హిట్టు, ఫట్టూ రెండూ!

దాదాపు 200 థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ అవుతోంది. ఇంతకీ ఈ ప్రమోషన్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందా...ఇంతకీ ఆ సినిమా ఏంటి...రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించినసినిమా బీచ్‌ రోడ్‌ చేతన్‌. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ని శుక్రవారం విడుదల చేసారు.  చిత్రంగా ఈ సినిమా హౌస్ ఫుల్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.  ఈ సినిమాకు మార్నింగ్ షోకు ఫ్రీగా టిక్కెట్లు ఇచ్చారు.

ముఖ్యం గా ఈ ఫ్రీగా సినిమా చూడొచ్చు అన్న కాన్సెప్ట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్లే వారి కోసం కాదు. ఎవరైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని థియేటర్ కి వెళ్తున్నారో వారి కోసమే. సింగిల్ స్క్రీన్స్ లో థియేటర్స్ దగ్గర మేమే టికెట్స్ ఇచ్చారు.  మల్టీప్లెక్స్ లో  ఆ సినిమా ఏజెంట్ ఉండి అతడు టికెట్స్ ఇచ్చాడు. ఒకవేళ బుక్ మై షోలో ఎవరైనా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటే.. థియేటర్ దగ్గర మా ఏజెంట్ ను కలిస్తే మీకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేసారు.

ఇక సినిమా ఫ్రీగా రావటంతో జనం ఎగబడ్డారు. కొన్ని చోట్ల  టిక్కెట్టు దొరక్క‌పోతే థియేట‌ర్ య‌జ‌మాన్యంపైనా తిర‌గ‌బ‌డ్డార‌ు‌.  కొన్ని థియేటర్ల నుంచి వంద‌ల మంది టికెట్స్ దొరక్క నిరాశతో తిరిగి వెళ్లిపోయార‌ట‌. గోదారి జిల్లాల్లో కొన్నిచోట్ల‌.. హైదరాబాద్ లో గోకుల్ – సంధ్య వ‌ద్ద ఇదే సీన్ క‌నిపించింద‌ని సమాచారం. మ్యాట్నీ నుంచి టిక్కెట్లు కొనుక్కోమ‌న్నారు అంతే జనం వెనక్కి తిరిగారు. దాంతో ఈ ఉచిత ఆఫ‌ర్ ఉన్నంతవరకే ఫలించింది.