ఒక‌ప్పుడు తెలుగులో టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ.  దాదాపు 55 సినిమాల్లో నటించిన ఛార్మి హీరోయిన్ నుంచి నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఘన విజయం సాధించటంతో చాలా ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో  పూరీజ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించే సినిమాల‌కి సంబంధించిన‌ ప్రమోష‌న్స్‌లోను ఛార్మి చాలా యాక్టివ్‌గా పని చేస్తోంది.

ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమాని పూరీ జ‌గ‌న్నాథ్ తన కుమారుడు హీరోగా  నిర్మిస్తూండగా, ఈ సినిమాకి సంబంధించిన విశేషాల‌ని ఎప్పటిక‌ప్పుడు త‌న ట్విట్టర్ ద్వారా అభిమానుల‌కి చేర‌వేస్తోంది ఛార్మీ. అయితే తాజాగా ఆమె తన రొమాంటిక్ యోగను అభిమానులకు పరిచయం చేసింది.

పాత బంగారం:కనపడేది ఎన్టీఆర్..కానీ గొంతు వేరే వారిది

గోవాలో రొమాంటిక్ చిత్రం లాస్ట్ షెడ్యూల్ లో ఉన్న ఆమె యోగాసనాలు వేస్తోంది. ఆ ఫోజులను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఛార్మిని ఇలా చూసిన వాళ్లు మళ్లీ హీరోయిన్ గా తెరపై ఆమె కనపడితే భలే ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రొమాంటిక్ చిత్రం విశేషాలకు వస్తే..ఇప్పటికే  హీరో, హీరోయిన్ కౌగిలించుకున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ లో చూపించి యూత్ కి పిచ్చెక్కించారు. అనిల్ పాదూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ సరసన..కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్‌ వంటి బ్లాక్ బ‌స్టర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌ పై  పూరి, చార్మి ఈ సినిమాను నిర్మించడంతో..ఈ రొమాంటిక్ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.