Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'.. వర్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఎప్పటిలాగే ఈ చిత్రం కూడా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. దీనితో ఈ చిత్ర విడుదల అనుమానమే అని భావిస్తున్న తరుణంలో హై కోర్టు చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ తెలిపింది. 

censor board gives green signal to Kamma rajyamlo Kadapa reddlu movie
Author
Hyderabad, First Published Dec 11, 2019, 7:50 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఎప్పటిలాగే ఈ చిత్రం కూడా తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. దీనితో ఈ చిత్ర విడుదల అనుమానమే అని భావిస్తున్న తరుణంలో హై కోర్టు చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ తెలిపింది. 

తాజగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కావడంతో రేపు(గురువారం) గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ని పోస్ట్ చేశాడు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం. 

నాటకీయ పరిణామాల మధ్య ఈ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్ర టైటిల్ కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని.. కొన్ని పాత్రలు రాజకీయాల నాయకులని కించపరిచేలా ఉన్నాయని హై కోర్టులో కేసు నమోదైంది. వివాదం ముదురుతుండడంతో వర్మ ఈ చిత్ర టైటిల్ ని 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చారు. 

ఇక సినిమాలో రాజకీయ నాయకులని పోలిన పాత్రలు ఉండడం, వారిని కించపరిచేలా సన్నివేశాలు ఉండడంపై హైకోర్టు బుధవారం రోజు విచారణ జరిపింది. ఈ చిత్రం కథ ఎలా ఉంది అనే విషయంలో రివ్యూ కమిటీ, సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. ఒక సినిమా విషయంలో తాము జోక్యం చేసుకోలేం అని హైకోర్టు స్పష్టం చేయడంతో ఈ చిత్రానికి లైన్ క్లియర్ అయింది. 

4 రోజులు.. నలుగురు లవర్ల కోసం టైం ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ!

కోర్టు తన నిర్ణయం తెలపడంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయడం, వర్మ ప్రకటించడం చక చకా జరిగిపోయాయి. అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు చిత్ర రిలీజ్ కు అనుమతి ఇప్పడంపై కేఏ పాల్ మండిపడుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లని పోలిని పాత్రలని ఈ చిత్రంలో వర్మ రూపొందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios