సినిమా వాళ్లకి సెంటిమెంట్లు చాలా ఎక్కువ.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ తన సినిమాకి స్టోరీ రాసుకోవాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందే.. రీసెంట్ గా హీరో రామ్ కి గోవాలో షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని తన తదుపరి చిత్ర దర్శకులకు అలా ప్లాన్ చేయమని చెబుతున్నాడు.

ఇదో రకమైన సెంటిమెంట్.. అలానే దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. ప్రతీ సినిమాకి ముందు కనిపించి 'రెడీ బాబు.. యాక్షన్' అని చెప్పడం బోయపాటి స్టైల్.. ఇప్పుడు అదే సెంటిమెంట్ గా మారింది. బోయపాటి సెంటిమెంట్ లిస్ట్ లోకి హీరోయిన్ కేథరిన్ కూడా చేరింది.

అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

బోయపాటి సినిమా 'సరైనోడు'లో హీరోయిన్ గా నటించింది కేథరిన్. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో తన తదుపరి సినిమా 'జయ జానకి నాయక'లో ఓ పాటకు తీసుకొచ్చి డాన్స్ చేయించారు. ఇప్పుడు మరోసారి కేథరిన్ ని ఎన్నుకున్నాడట బోయపాటి. బాలకృష్ణ హీరోగా ఈ మాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఓ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నుండి నయనతార వరకు అందరి పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. రెండో హీరోయిన్ గా మాత్రం కేథరిన్ ని లాక్ చేశారని తెలుస్తోంది.

బోయపాటి తన సెంటిమెంట్ ప్రకారమే.. కేథరిన్ కి ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. కేథరిన్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందుకే తాను కూడా అంగీకరించినట్లు సమాచారం. మొత్తానికి బోయపాటి కేథరిన్ ని మాత్రం విడిచిపెట్టకుండా తన సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!