సినిమా కోసం అవసరం అనుకుంటే ఎంతైనా ఖర్చుపెడతారు. పలానా ప్లేస్ లో సెట్ వేయాలి.. ఆ ఆర్టిస్ట్ లే కావాలి అనుకున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఇప్పుడు దర్శకుడు బోయపాటి కూడా అదే చేస్తున్నాడు. బాలకృష్ణతో బోయపాటి చేయబోయే సినిమాకి మంచి హీరోయిన్ కావాలి.

కానీ బాలయ్య పక్కన హీరోయిన్ అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. చాలా సినిమాల నుండి బాలయ్యకి హీరోయిన్ దొరకడం కష్టంగా మారింది. అందుకే బోయపాటి తన మాట కాదనని హీరోయిన్ కేథరిన్ ని తీసుకోవాలని అనుకున్నారు. ఆమె కూడా దానికి ఓకే చెప్పింది. అక్కడితో సమస్య తీరింది.

ఈ హిట్టు సినిమాల్లో ఈ హీరోలకు ఏం నచ్చేలేదో?

కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అదే రెమ్యునరేషన్.. కేథరిన్ తెలుగులో బాగా పరిచయం ఉన్న హీరోయినే కానీ కోటి రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే క్రేజ్ ఆమెకి లేదు. కానీ ఆమె మాత్రం అదే రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాకి కోటి ఇవ్వాలని కేథరిన్ డిమాండ్ చేస్తుందట.

నిజానికి బాలయ్యతో సినిమా అంటే వీలైనంత ఖర్చు తగ్గించుకోవాలి కానీ హీరోయిన్ విషయంలో తప్పదు అని బోయపాటి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య పక్కన హీరోయిన్ దొరకడమే కష్టం. దొరికిన తరువాత రెమ్యునరేషన్ అటు ఇటు అయినా ఓకే అని డిసైడ్ అయి.. రూ.80లక్షలకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ విధంగా కేథరిన్ రెమ్యునరేషన్ ఎనభై లక్షలకు సెటిల్ చేసి, ఓకే చేయించుకున్నట్లు సమాచారం. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రూ.70 కోట్ల ఖర్చుని అంచనా వేస్తున్నారు.